స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు: నేను ఇప్పటికే మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా పని చేశా.. నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించా.. సీఎం పదవిపై ఆశ లేదు.. ఎవరికీ పోటీ కాను’’ అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ చింతకుంట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లో గురువారం కాంగ్రెస్విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరకు రాష్ట్రస్థాయి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఇప్పటికే లేఖ రాశానని.. స్వయంగా ఆయనను కలిసి సూచించానని పేర్కొన్నారు.
ప్రోటో కాల్పోస్ట్వస్తేనే స్టేషన్‌ఘన్‌పూర్‌లో అడుగుపెడతానని ఆమె కాంగ్రెస్కార్యకర్తలతో చెప్పినట్లు తెలిసిందని, తమ మధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని, అలాంటి అపోహలు నమ్మవద్దని ఆయన సూచించారు. 15 ఏండ్లలో నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని, ప్రజల బాధలను పట్టించుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.