రేవంత్...నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే కదా.?: కడియం

రేవంత్...నీ కుర్చీ ఇనాం కింద వచ్చిందే కదా.?: కడియం

సీఎం రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆయన భాషను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.  కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతిని వైఫల్యంగా చూపించడం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న అలోచన తమకు లేదన్నారు కడియం శ్రీహరి. సొంత ఎమ్మెల్యేలతో రేవంత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  రేవంత్ కు సీఎం కుర్చీ  ఇనాం కింద వచ్చిందేనన్నారు.  కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదు.. ప్రాంతీయ పార్టీ అని విమర్శించారు.  కాంగ్రెస్ పార్టీ ఆప్ కంటే అధ్వానంగా మారిందన్నారు.

కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదన్నారు కడియ శ్రీహరి.  మేడిగడ్డకు కేవలం 3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కుంగిన 3 పిల్లర్లు రిపేర్ చేసి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని చెప్పారు.  సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. 

Also Read: మరో కొత్త రిలీజ్ డేట్తో..ఆర్జీవీ వ్యూహం