పీచరలో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే రాజయ్యను నిలదీసిన జనం

పీచరలో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే రాజయ్యను నిలదీసిన జనం

పీచరలో రచ్చ రచ్చ
ఎమ్మెల్యే రాజయ్యను నిలదీసిన జనం
సమాధానం చెప్పక వెళ్లిపోయిన ఎమ్మెల్యే
వేలేరు మండలంలో ఘటన

ధర్మాసాగర్ : స్టేషన్​ ఘన్​ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వేలేరు మండలంలో చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రాజయ్య నియోజక వర్గంలోని వేలేరు మండలంలో సోమవారం రాత్రి ప్రగతి నివేదన యాత్ర చేపట్టారు. అనంతరం పీచర గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా.. స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు.

సాగునీరు, ఇంటి స్థలాలు, పింఛన్లు ఇవ్వడంలో ఎమ్మెల్యేగా ఏం చేశావని నిలదీశారు. అసలు వేలేరు మండలానికి ఏమేం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. స్థానికుల నిలదీత ఆగకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.