స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

కడియం దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య అధిపత్యపోరు కొనసాగుతోంది. ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ కడియంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ‘‘కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త’’ అంటూ వ్యాఖ్యానించారు. 

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారని ఎమ్మెల్యే రాజయ్యచెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కడియం శ్రీహరి కూతురు ఎస్సీ కాదని, బీసీ బీ కులానికి చెందుతారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 85 వేల ఎస్సీల ఓట్లు ఉంటే.. దాంట్లో 63 వేల ఓట్లు మాదిగలవే అంటూ కామెంట్స్ చేశారు. 

14 ఏళ్లు మంత్రిగా ఉండి ఏనాడు కూడా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాన్ని కడియం శ్రీహరి పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియం మంత్రి కావాలనుకుంటే అతనికి ఎమ్మెల్సీ పదవి సరిపోతుందన్నారు. నియోజకవర్గంలో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు కడియం శ్రీహరితో పాటు ఆయన అనుచరులు ఏనాడు కూడా హాజరుకారని చెప్పారు. 

‘‘ దళితులందరూ చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిమ్ములను కంటికి రెప్పలా కపాడాటం నా బాధ్యత. నియోజకవర్గంలో గొప్పగా పని చేస్తున్న నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అన్ని గ్రామాల్లోనూ తిరుగుతా.. ఇంటింటికీ పోతా. నీవు పోతావు.. చూద్దాం. నేను డప్పు కొడుతాను..? నీవు కొడుతావా..? తప్పకుండా కేసీఆర్ నన్ను పిలిపించుకుంటారు. గ్లోబెల్స్ ప్రచారం చేసేవాళ్ల మాటలు నమ్మవద్దు’’ అంటూ కడియం శ్రీహరికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే రాజయ్య.