స్టేషన్‌ఘన్‌పూర్/ ధర్మసాగర్/ వేలేరు, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్టికెట్ విషయంలో ఎమ్మెల్యే రాజయ్య వర్గానికి చెందిన నేతలు శనివారం నియోజకవర్గంలో పలుచోట్ల ఆందోళనలకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్యకే టికెట్ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీదికొండ క్రాస్ రోడ్డులో నేషనల్ హైవేపై తాటికొండ ఉప సర్పంచ్ మారపాక రాములు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేశారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద ఎమ్మెల్యే రాజయ్య తమ్ముడు, సర్పంచ్ సురేశ్‌కుమార్, జెడ్పీటీసీ మారపాక రవి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించి కడియం దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే తమ్ముడు సురేశ్‌కుమార్ ను పంచాయతీ ఆఫీస్‌లోనే నిర్బంధించారు. హనుమకొండ జిల్లా వేలేరులో కడియంకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
ఆయన దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ధర్మసాగర్ లోమండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. అనంతరం పలువురు నాయకులు అమరవీరుల స్థూపం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిత్యం బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే రాజయ్యకే టికెట్ ఇవ్వాలని ఎంపీపీ సమ్మిరెడ్డి కోరారు. కార్యక్రమాల్లో పలువురు జెడ్పీటీసీలు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.