
- రెండో వన్డేలో 122 రన్స్ తేడాతో ఇండియా ఓటమి
- పెర్రీ, వోల్ మెరుపు సెంచరీలు
- 2–0తో సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియా
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా టూర్‌లో ఇండియా అమ్మాయిలు మరోసారి తేలిపోయారు. స్టార్ ప్లేయర్ ఎలైస్ పెర్రీ (75 బాల్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో105), ఓపెనర్ జార్జియా వోల్ (87 బాల్స్‌లో 12 ఫోర్లతో101) సెంచరీలతో దంచికొట్టడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 122 రన్స్ తేడాతో ఇండియాను చిత్తుగా ఓడించింది. మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 371/8 స్కోరు చేసింది.
వన్డేల్లో ఇండియాపై ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. లిచ్‌ఫెల్డ్ (60), బెత్ మూనీ (56) కూడా రాణించారు. సైమా ఠాకూర్ (3/62) మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా (1/88), ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి (2/71) ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నారు. అనంతరం ఛేజింగ్‌లో ఇండియా 44.5 ఓవర్లలో 249 స్కోరుకే ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ రిచా ఘోష్ (54), మిన్ను మణి (46 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్ (43), కెప్టెన్ హర్మన్ ప్రీత్ (38) పోరాడినా ఫలితం లేకపోయింది.
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (9)తో పాటు హర్లీన్ డియోల్ (12), దీప్తి శర్మ (10) ఫెయిలయ్యారు. . అనాబెల్ సదర్లాండ్ (4/39) నాలుగు వికెట్లతో ఇండియాను దెబ్బకొట్టింది. పెర్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో, చివరి వన్డే బుధవారం జరుగుతుంది.