ప్రపంచ ముఖచిత్రంపై అత్యంత అరుదైన ప్రజా గాయకుడు, తూప్రాన్ ముద్దుబిడ్డ గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ ఆకస్మిక మరణం బాధాకరం. దాదాపు నాలుగైదు దశాబ్దాల పాటు అత్యంత క్రియాశీలకంగా పౌర జీవితంలో, ఉద్యమాల్లో పాల్గొంటూ కోట్లాది మందిలో చైతన్యం తీసుకువచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రజా ఉద్యమకారుడిగా, ప్రజా కళాకారుడిగా ఆయనకు ప్రభుత్వం తగిన గుర్తింపునివ్వాల్సిన అవసరం ఉన్నది.
ఈ మేరకు తూప్రాన్‌లో, ట్యాంక్‌బండ్‌పై గద్దర్విగ్రహం పెట్టాలి. ఆయన పేరిటి ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలి. ప్రస్తుత మెదక్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలి. తూప్రాన్ లో ఒక పెద్ద మీటింగ్ హాల్, కళాభవన్ ను జానపద కళారూపాల శిక్షణ కేంద్రంగా పెట్టాలి. తెలంగాణ రచయితలు, కవులు, కళాకారుల కింద గద్దర్ జీవిత చరిత్రను ఏదైనా పాఠ్య పుస్తకంలో ఒక అధ్యాయంగా చేర్చాలి. గద్దర్ పేరుతో ఏటా రాష్ట్ర స్థాయి అవార్డులు, పురస్కారాలు ప్రదానం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాను.
కె. శ్రీనివాసాచారి, తూప్రాన్ పరిరక్షణ సమితి