భద్రకాళి చెరువులో.. సుబ్రమణ్యస్వామి విగ్రహం

భద్రకాళి చెరువులో..  సుబ్రమణ్యస్వామి విగ్రహం

వరంగల్‍ సిటీ, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి ఆలయానికి చెందిన చెరువు తవ్వకాల్లో దేవుళ్ల విగ్రహాలు బయటపడుతున్నాయి. చెరువులో మట్టి పూడికతీత పనులు చేపడుతుండగా బుధవారం చెరువుకు ఓ వైపు ఆనుకుని ఉండే ఆంజనేయస్వామి దేవస్థానం ప్రాంతంలో మత్తడి వద్ద సుబ్రమణ్యస్వామి విగ్రహం బయటపడింది.  

అర్చకులు, స్థానికులు విగ్రహాన్ని అలంకరించి పూజలు నిర్వహించారు. కాగా, పనులు చేపట్టిన మొదట్లోనూ గణేశుడి విగ్రహాలు బయటపడ్డాయి.