ఓలలో ఘనంగా గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠ

కుంటాల/కుభీర్, వెలుగు: కుంటాల మండలం ఓల గ్రామంలో శుక్రవారం గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపన ఘనంగా జరిగింది. ప్రత్యేక పూజల్లో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. అంతకు ముందు వేద పండితులు భగవాన్ జోషి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ.. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. 

ఒకేసారి వీరాంజనేయ, పెద్దమ్మతల్లి, రేణుక ఎల్లమ్మ ఆలయాలు నిర్మించుకోవడం గొప్ప విషయమని గ్రామస్తులను అభినందించారు. నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం లింబాబీ గ్రామంలో నిర్వహించిన పడి పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుభీర్​మండలం పల్సి గ్రామంలో రూ.20 లక్షల అంచనాతో హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, నాయకులు బోయిడి విఠల్, రమేశ్, గులాబ్, కనకయ్య ,నాగేందర్, సాయినాథ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.