
ముషీరాబాద్, వెలుగు: ప్రతీ మండల కేంద్రంలో పూలే దంపతుల విగ్రహాలను నెలకొల్పుతామని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు అన్నారు. మంగళవారం జోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ లతో కలిసి, చిక్కడపల్లిలోని కమిటీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. నాయకులు ఎల్లికట్టె విజయ్ కుమార్ గౌడ్, అయిలి వెంకన్న గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, హరిశంకర్ గౌడ్, పాల్గొన్నారు.