స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ ఫేమస్ ఇన్వెస్టర్ ట్వీట్ చూసి డిసైడ్ అవడం బెటరేమో..!

స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ ఫేమస్ ఇన్వెస్టర్ ట్వీట్ చూసి డిసైడ్ అవడం బెటరేమో..!

ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే స్థలాలు, పొలాలు కొనడం.. వీలైనంత ఎక్కువ బంగారం కొనడం. కానీ.. ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ మెంట్స్ మొదలుకుని మ్యూచువల్ ఫండ్స్.. ఇలా చాలానే ఉన్నాయి. కానీ.. ప్రముఖ ఇన్వెస్టర్ శంకర్ శర్మ మాత్రం స్టాక్ మార్కెట్ కు, మ్యూచువల్ ఫండ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలని.. ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం కొనుగోలు, ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే భూములు కొనుగోలు బెస్ట్ అని చెబుతున్నారు.

ఇన్వెస్ట్ చేయడానికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న బుర్రే ఉండక్కర్లేదని.. డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామనే విషయంలో.. ఒక విచక్షణ, క్రమశిక్షణతో కూడిన ఆలోచన ఉంటే సరిపోతుందని ఆయన చెప్పారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం కొనుగోలు, భూములు కొనుగోలు సూత్రాన్ని తన సోదరి, బావ తూచాతప్పకుండా పాటించి ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారని తన ఎక్స్ ఖాతాలో శంకర్ శర్మ చెప్పుకొచ్చారు.

Also Read:-ఎయిర్ టెల్ బాటలోనే జియో.. ఎలన్ మస్క్ స్టార్ లింక్‎తో జియో డీల్

ఒక చిన్న పట్టణంలో తన సోదరి, బావ ఉంటారని.. స్టాక్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని తనను అడిగారని తెలిపారు. ఈ స్టాక్స్కు, మ్యూచువల్ ఫండ్స్కు దూరంగా ఉండాలని సూచించానని.. వేటిపైన ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో కూడా చెప్పానని వివరించారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 40 శాతం, బంగారంపై 30 శాతం, 30 శాతం హోంటౌన్కు 25 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ కొనుగోలు చేయాలని శంకర్ శర్మ సూచించాడు. ప్రస్తుతం వాళ్లు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఒత్తిళ్లు లేకుండా హాయిగా జీవిస్తున్నారని చెప్పాడు.

తన సోదరికి, బావకు ఆర్బీఐ అంటే ఏంటో, ఆర్బీఐ గవర్నర్ ఎవరో, యూఎస్ ఫెడ్ అంటే ఏంటో.. జీడీపీ అంటే ఏంటో.. ట్రేడ్ వార్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా.. అవన్నీ తెలుసుకోవాల్సిన పని లేకుండా హాయిగా ప్రశాంత జీవనం కొనసాగిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్ శంకర్ శర్మ తెలిపారు. అయితే.. శంకర్ శర్మ చెప్పుకొచ్చిన ఈ వ్యక్తిగత అనుభవంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. కొందరు ఇదే బెస్ట్ ఐడియా అని కొనియాడుతుంటే.. ఒక చిన్న పట్టణంలో నివసిస్తూ ఇలా ఇన్వెస్ట్ చేయడం కాదని, ఒక మెట్రో సిటీలో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తే అప్పుడు నొప్పేంటో తెలుస్తుందని.. అప్పుడు ఈ పప్పులన్నీ ఉడకవని అభిప్రాయపడ్డారు.