
- ఈ నెల 20కి విచారణ వాయిదా
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును విచారించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది.
ప్రైవేటు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా.. రివిజన్‌పై విచారణ చేపట్టాలన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు నిర్ణయాన్ని కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్ రావు ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారించారు.
అయితే, పిటిషనర్ నాగవెల్లి రాజలింగమూర్తి తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు గడువు కావాలని కోరగా.. న్యాయమూర్తి అసంతప్తి వ్యక్తం చేశారు. కౌంటరు దాఖలు చేయడానికి ఎంత టైం కావాలి? ఏడాది గడువు సరిపోతుందా అని నిలదీశారు. చివరి అవకాశంగా ఈ నెల 20కి వాయిదా వేస్తున్నామని.. ఆలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించారు.