
ఎక్కడికైనా వెళ్లాలి.. ఆటోనో, క్యాబో బుక్ చేసుకుంటాం. మరి, భద్రత మాటేంటి? ముఖ్యంగా అమ్మాయిలు. అలాంటి వాళ్ల కోసమే గూగుల్ మ్యాప్స్ ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ‘స్టే సేఫర్’. ప్రయాణం భద్రంగా, సాఫీగా సాగిపోయేలా ఈ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఎక్కిన ఆటో లేదా క్యాబ్ తప్పుడు దారిలో తీసుకెళితే వెంటనే అలర్ట్ చేస్తుందిది. ఆ ట్రిప్‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తూ వాళ్ల ప్రయాణాన్ని ట్రాక్ చేస్తుంది. ప్రస్తుతానికి అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసింది. గమ్యాన్ని సెలెక్ట్ చేసుకుని ట్రిప్ స్టార్ట్ చేశాక ‘స్టే సేఫర్’ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలి. దాంతో పాటే ‘గెట్ ఆఫ్ రూట్ అలర్ట్స్’ పైనా క్లిక్ చేయాలి. ఎక్కిన వాహనం అరకిలోమీటరు దూరం దారి తప్పినట్టు తెలిస్తే, ఎక్కడున్నామో నోటిఫికేషన్ పంపుతుంది.