అందంగా ఉండాలి. దాంతోపాటు ఆరోగ్యం కావాలనుకుంటున్నారా? అయితే మీరు ఎంచక్కా స్టీమ్ చేయొచ్చు. స్టీమ్ బాత్ అనేక ప్రయోజనాలు ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. స్టీమ్బత్ వల్ల శరీరం రిలాక్స్ కావటంతో పాటు యూత్పుల్నెస్ ఫీలింగ్ కలుగుతుంది. దీంతో పాటు సైనస్ శుభ్రంగా ఉంటుంది. ఇంతకీ ఆవిరిపట్టడం వల్ల ముఖ్య ఉపయోగాలేంటో తెలుసుకుందాం.
స్టీమ్ థెరఫీ గ్రీకుల కాలం నుంచే ఉంది. ఆరోగ్యమైన శరీరం కోసం గ్రీకులు స్టీమాబాత్ను ఆశ్రయించేవారట. మన దేశంలో ఆవిరిపట్టుకోవడం అనే ప్రక్రియ చాలా సహజమైనది. ఆవిరిపట్టుకోవడం వల్ల 'అందమైన ఆరోగ్యం' సొంతమవుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వదులుతుంది.
Also Read :- మొక్కజొన్న తింటే ఎంత లాభమో తెలుసా
ఇంకా స్ట్రీమ్ బాత్వలన ఉపయోగాలు ఇవే..
- ఆవిరిపట్టుకోవడం వల్ల శరీరం రిలాక్సేషన్ స్థితికి వస్తుంది. దీంతో పాటు సుఖనిద్ర కలుగుతుంది.
- ఇమ్యూన్ సిస్టమ్ స్టీమ్ బాత్ వల్ల బలపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.
- జలుబు, దగ్గు, అలర్జీ సమస్యలు స్టీమ్ బాత్తో వదిలిపోతాయి.
- శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్ బయటకు పోతాయి.
- చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. చర్మంపై నొప్పితో కూడిన వాపు త్వరగా తగ్గిపోతుంది.
- స్ట్రీమ్ బాత్ వల్ల బరువు తగ్గుతారని పరిశోధకులంటున్నారు
–వెలుగు.. లైఫ్–