
భిలాయ్‌లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్) 259 కన్సల్టెంట్, మేనేజర్, ట్రెయినీ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, డిప్లొమా, ఐటీఐ, బీటెక్, ఎంబీబీఎస్, పీజీలో ఉత్తీర్ణత సాధించాలి. పోస్టును బట్టి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.
సెలెక్షన్: రాతపరీక్ష/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్లైన్లో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.sailcareers.com వెబ్సైట్ సంప్రదించాలి.