
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య శనివారం భారీగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 210 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 161 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. 41 మంది ఇతర స్టేట్ నుంచి వచ్చిన వారు, అలాగే 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోని కొత్త హాట్‌స్పాట్స్‌లో నయా పాజిటివ్ కేసులు వెలువడుతున్నప్పటికీ వాటికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
స్టేట్ సెక్రటేరియట్‌లో వివిధ డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన వారిలో 5 మంది ఎంప్లాయీస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడం గవర్నమెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ప్లానింగ్, ఆర్టీజీఎస్, రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్స్‌లో ఒక్కో ఉద్యోగి కరోనా పాజిటివ్‌గా తేలారని ఎంప్లాయీస్ అసోసియేషన్ లీడర్స్ తెలిపారు. ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడుతున్న ఎంప్లాయీస్, విజిటర్స్‌ను మాత్రమే సర్కార్ అనుమతిస్తున్నప్పటికీ సెక్రటేరియట్ కరోనా హాట్‌స్పాట్‌గా మారడం గమనార్హం. కాగా, ఏపీలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,460కి చేరింది. వీరిలో 2,601 మంది ట్రీట్‌మెంట్ తర్వాత ఆస్పత్రుల నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,786గా ఉంది. ఇప్పటివరకు ఏపీలో వైరస్ బారిన పడి 73 మంది చనిపోయారు. ఏపీలో 4,36,335 కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉంది.