సిద్ధిపేట జిల్లాలో స్టీరింగ్ రాడ్డు విరిగి.. పొలాల్లోకి దూసుకెళ్లిన పల్లెవెలుగు బస్సు

సిద్ధిపేట జిల్లాలో స్టీరింగ్ రాడ్డు విరిగి.. పొలాల్లోకి దూసుకెళ్లిన పల్లెవెలుగు బస్సు

సిద్ధిపేట జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు స్టీరింగ్ రాడ్డు విరగడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది ఆర్టీసీ బస్సు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని ముత్తన్నపేట స్టేజి సమీపంలో బస్సు స్టీరింగి విరిగింది. సరిగ్గా  కల్వర్టు వద్దకు వచ్చే సరికి స్టీరింగ్ రాడ్డు విరిగి పంట పొలంలోకి దూసుకెళ్లింది పల్లెవెలుగు బస్. దీంతో ప్రయాణికులు భయాందోళనతో కేకలు వేశారు.

ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. స్టీరింగ్ రాడ్డు విరగడంతో వెంటనే రోడ్డు దింపడం జరిగిందని డ్రైవర్ తెలిపాడు. ప్రమాదాన్ని ఊహించి రోడ్డు దింపడంతో బస్సు పొలాల్లోకి దూసుకువెళ్లిందని, ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడు. ఏ ప్రమాదం జరగక పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.