
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీవో పరిశోధనా కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, టైపింగ్ నాలెడ్జ్, డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు- 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు రూ.35400- నుంచి రూ.112400, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టులకు రూ.25500- – రూ.81100, ఇతర పోస్టులకు రూ.19900- నుంచి రూ.63200 వరకు ఉంటుంది.
సెలెక్షన్: పోస్టును అనుసరించి టైర్-1(సీబీటీ), టైర్-2(స్కిల్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్) తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. వివరాలకు www.drdo.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.