
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో 1207 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి(గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి(గ్రూప్ సి) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత: ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు ఆగస్టు 1 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి పోస్టులకు 18- నుంచి 30 ఏళ్లు, గ్రేడ్- డి పోస్టులకు 18 నుంచి -27 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో రూ. 100 అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆగస్టు 23 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్స్ హైదరాబాద్, వరంగల్‌లో ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించనున్నారు. వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.