Vastu Tips: మెట్లకు ఎదురుగా డోర్​ ఉండవచ్చా.. ఉంటే ఏమవుతుంది..

Vastu Tips:  మెట్లకు ఎదురుగా డోర్​ ఉండవచ్చా.. ఉంటే ఏమవుతుంది..

ఇంటి వాస్తులో మెట్లు.. డోర్లు  ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంటి మెట్లు ..డోర్లు సరిగ్గా ఉంటే వ్యక్తి పురోగతి శిఖరానికి చేరుకుంటాడు. ఇక అవి సరిగ్గా అంటే వాస్తు ప్రకారం  లేకపోతే ఇంట్లో అనేక సమస్యలు మొదలవుతాయి. ఆర్థిక ఇబ్బందులతో పాటు సంతోషం, శాంతి చెదిరిపోతుంది. మెట్లు.. డోర్లు విషయంలో వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ సూచనలను తెలుసుకుందాం. . . 

 ప్రశ్న : మొదటి అంతస్తులో మెట్లకు ఎదురుగా డోరు ఉండవవచ్చా. ?

జవాబు  : మొదటి అంతస్థులోనే కాదు.. ఏ ఫ్లోర్​ లో కూడా  మెట్లకు ఎదురుగా ప్రధాన ద్వారము గాని.. ఎలాంటి డోర్​ కాని ఉండకూడదు.  ఇలా  కచ్చితంగా వాస్తు ప్రకారం ఆ ఇంటిలో డోర్లను సరిచేయించుకోవాల్సిందే. అంతే కాదు మెట్లకు ఎదరుగా డోర్​ ఉంటే బయటకువెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు . చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. కాబట్టి, మెయిన్ డోరు వాస్తు ప్రకారం, కొంచెం జరిపి కట్టుకుంటే మంచిదని వాస్తు కన్సల్టెంట్​  కాశీనాథుని శ్రీనివాస్​ తెలిపారు. 

ALSO READ | 14 వ తేదీ మనకు హోలీ.. వరుసగా మూడు రోజులు సెలవులు