- ప్రొఫెసర్ కొదండరాంతో జిల్లా సర్పంచులు
భిక్కనూరు, వెలుగు: గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల తాలుకు పెండింగ్ బిల్లులు చెల్లించే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నర్సింలు యాదవ్ప్రొఫెసర్ కోదండరాంను కోరారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజీగూడలో రాష్ట్ర స్థాయి సర్పంచుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సర్పంచులు తరలివెళ్లారు. సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ తునికి వేణు, మండలాధ్యక్షుడు చిట్టెడి మధుమోహన్రెడ్డి, ఉపాధ్యక్షుడు గుడిసె రాములు ఉన్నారు.