నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలి

  • అడిషనల్ ​కలెక్టర్​కు కౌన్సిలర్ల వినతి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఎండాకాలంలో తాగు నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ పలువురు కౌన్సిలర్లు కలెక్టరేట్​లో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందనకు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు వై. శ్రీనివాస్​రెడ్డి, బోయిన విజయ్​ కుమార్, పీ.సత్యానారాయణ చారి మాట్లాడారు. ప్రతిసారి ఎండాకాలంలో ప్రజలు తాగు నీటి ఎద్దడితో అల్లాడుతున్నారని వాపోయారు.

జీవో నంబర్​ 76 ద్వారా పెండింగ్​లో ఉన్న పట్టాలను పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. కోతులు, కుక్కల బెడదతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో మాజీ కౌన్సిలర్​ మాచర్ల శ్రీనివాస్​ పాల్గొన్నారు.