కోఠి, మియాపూర్‌లోని మెడికల్‌షాపుల్లో రూ.3లక్షల స్టెరాయిడ్స్ సీజ్
హైదరాబాద్ సిటీ/బషీర్ బాగ్, వెలుగు: అక్రమంగా జిమ్సెంటర్లకు స్టెరాయిడ్స్ ను విక్రయిస్తున్న మెడికల్‌షాపులపై డ్రగ్స్ కంట్రోల్ సొసైటీ ఆఫీసర్లు శుక్రవారం దాడులు నిర్వహించారు. కోఠి ఇసామియా బజార్లో రాకేశ్డిస్ట్రిబ్యూటర్ పేరుతో నడుస్తున్న షాపులో ఆండ్రోజెన్, అనాబాలిక్ వంటి 22 రకాల స్టెరాయిడ్లను గుర్తించారు. వీటి విలువు దాదపు రూ.2లక్షలు ఉంటుందని, జిమ్ కు వెళ్లే యువతకు బాడీ బిల్డింగ్ కోసం విక్రయిస్తున్నట్లు తెలుసుకున్నారు. నిర్వాహకుడు రాకేశ్ కనోడియాపై కేసు నమోదు చేసినట్లు గోషామహల్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ అజయ్ , మెహదీపట్నం డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ సంతోశ్తెలిపారు. ఈ స్టెరాయిడ్స్ వాడకం గుండె సంబంధిత సమస్యలు, కాలేయం దెబ్బతినడం, కిడ్నీల ఫెయిల్యూర్, మానసిక రుగ్మతలకు దారి తీస్తుందని చెప్పారు. అలాగే మియాపూర్ లోని శ్రీకాంత్ న్యూరోసెంటర్ హాస్పిటల్మెడికల్ షాపులో రూ.1.01లక్షల విలువైన స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిమ్‌కు వెళ్లే యువతకు స్టెరాయిడ్స్విక్రయిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో శేరిలింగంపల్లి డ్రగ్స్ఇన్ స్పెక్టర్ఎ. శైలజారాణి, గండిపేట డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ డి.శ్వేతబిందు పాల్గొన్నారు.