IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లు.. కమ్మిన్స్ లేకపోతే బాధ్యతలు ఎవరికి..?

IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లు.. కమ్మిన్స్ లేకపోతే బాధ్యతలు ఎవరికి..?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. శుక్రవారం (డిసెంబర్ 20) క్రికెట్ ఆస్ట్రేలియా 14 మందితో కూడిన సభ్యులను ప్రకటించిన జట్టుకు పాట్ కమ్మిన్స్ జట్టును నడిపించగా.. స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లను వైస్ కెప్టెన్ లుగా ఎంపికయ్యారు. ఒక జట్టుకు ఇద్దరు వైస్ కెప్టెన్లను ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఒకవేళ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకపోతే అతని స్థానంలో ఎవరు కెప్టెన్సీ చేస్తారనే విషయంలో క్లారిటీ వచ్చింది. 

కమ్మిన్స్ జట్టుకు ఏదైనా కారణం వలన దూరమైతే అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేస్తాడు. స్మిత్ ట్రావిస్ హెడ్ సలహాదారుడిగా ఉంటాడు. ట్రావిస్ హెడ్ ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 409 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. మరోవైపు స్మిత్ బ్రిస్బేన్ టెస్టులో సెంచరీ చేసి ఫామ్ అందుకున్నాడు.  చివరి టెస్టుల స్క్వాడ్ విషయానికి వస్తే గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైన నేథన్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌స్వీని తప్పించారు.

ALSO READ : కొన్‌స్టస్‌ ఇన్‌‌‌‌‌‌‌‌..మెక్‌‌‌‌‌‌‌‌స్వీని ఔట్‌‌‌‌‌‌‌‌..ఇండియాతో చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా టీమ్‌‌‌‌‌‌‌‌ ప్రకటన

వాట్ని స్థానంలో 19 ఏండ్ల యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సామ్‌‌‌‌‌‌‌‌ కొన్‌స్టస్‌ను తొలిసారి టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. ఒకవేళ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ డే టెస్ట్‌‌‌‌‌‌‌‌లో కొన్‌స్టస్‌ అరంగేట్రం చేస్తే 70 ఏళ్ల చరిత్రలో టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టిస్తాడు.  ఖవాజతో కలిసి కొన్‌స్టస్‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగొచ్చు. కాలి పిక్క గాయంతో టీమ్‌‌‌‌‌‌‌‌కు దూరమైన పేసర్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌ హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో జో రిచర్డ్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ను తీసుకున్నారు. సీరీస్‌లోని చివరి రెండు మ్యాచ్‌ల కోసం సీన్ అబాట్, బ్యూ వెబ్‌స్టర్‌లను స్క్వాడ్ లో చేర్చారు. 

భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు:

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే , సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా , ట్రావిస్ హెడ్ , మిచెల్ మార్ష్ , బ్యూ వెబ్‌స్టర్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్,నాథన్ లియోన్ , ఝీ ఎ రిచర్డ్‌సన్ , స్కాట్ బోలాండ్, జోష్ ఇంగ్లీష్