గబ్బా టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ భారత జట్టును ఆదుకున్నాడు. మూడో రోజు క్రీజ్ లో కుదురుకున్న రాహుల్.. నాలుగో రోజు ఆ ఫామ్ ను కొనసాగించాడు. అద్భుతమైన హాఫ్ సెంచరీతో సిరీస్ లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సహచరులు విఫలమవుతున్నా రవీంద్ర జడేజాతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రాహుల్ ను దురదృష్టం వెంటాడింది. ఒక అద్భుత క్యాచ్ కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది.
స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో కట్ షాట్ ఆడబోయి స్లిప్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దూరంగా వెళ్తున్న బంతిని స్మిత్ చాలా షార్ప్ గా క్యాచ్ ను అందుకోవడం విశేషం. దీంతో 84 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అంతకముందు రాహుల్ 33 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కమ్మిన్స్ బౌలింగ్ లో స్టీవ్ స్మిత్ సెకండ్ స్లిప్ లో క్యాచ్ ను జారవిడిచారు. ఈ ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడిన రాహుల్ మరో 51 పరుగులు జోడించాడు.
ALSO READ : IND vs AUS 3rd Test: ఔటయ్యాడనే అసహనం.. డగౌట్ ముందు గ్లోవ్స్ విసిరికొట్టిన రోహిత్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రాహుల్ తో పాటు జడేజా కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో ప్రస్తుతం 9 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో మరో 230 పరుగులు వెనకబడి ఉంది. భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 30 పరుగులు చేయాల్సి ఉంది. నాలుగో రోజు రాహుల్ (82), జడేజా (60*) రాణించగా రోహిత్ శర్మ (10), నితీష్ కుమార్ (16) విఫలమయ్యారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది.
What a catch by Steve Smith to dismiss well set KL Rahul. pic.twitter.com/g5FkrJX3bQ
— Cricketopia (@CricketopiaCom) December 17, 2024