
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. లాహోర్ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 28) జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 47 సంఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో నాథన్ ఎల్లిస్ వేసిన చివరి బంతిని ఒమర్జాయ్ లాంగ్-ఆన్ దిశగా ఆడి సింగిల్ పూర్తి చేశాడు. మరో ఎండ్ లో ఉన్న నూర్ అహ్మద్ బ్యాటింగ్ సైడ్ వచ్చి బ్యాట్ క్రీజ్ లో పెట్టి అంతలోనే క్రీజ్ ముందుకు కదిలాడు. అయితే అప్పటికే బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి రాలేదు.
ఆసీస్ వికెట్ కీపర్ క్యారీ వికెట్లను కొట్టేసరికీ నూర్ అహ్మద్ క్రీజ్ బయట ఉన్నాడు. ఈ దశలో ఆస్ట్రేలియా రనౌట్ కు అప్పీల్ చేస్తే నూర్ అహ్మద్ ఔటయ్యేవాడు. కానీ స్మిత్ మాత్రం తన అప్పీల్ ఉపసంహరించుకున్నట్టు అంపైర్లకు తెలిపాడు. దీంతో నూర్ అహ్మద్ బతికిపోయాడు. స్మిత్ చేసిన చూపించిన క్రీడా స్ఫూర్తికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది.
ALSO READ : Champions Trophy 2025: అటల్, ఒమర్జాయ్ మెరుపులు.. ఆస్ట్రేలియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్
ప్రస్తుతం 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజ్ లో ట్రావిస్ హెడ్ (59), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (19) ఉన్నారు. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ టాపార్డర్ లో సెదికుల్లా అటల్ (85), మిడిల్ ఆర్డర్ లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (70) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది.
Great Sportsmanship from captain Steve Smith.
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) February 28, 2025
Noor was clearly out. pic.twitter.com/tMvZD06bP3