భారత స్టార్ ఆటగాడు రిషభ్ పంత్(Rishabh Pant) పేరిట ఉన్న ఏడేళ్ల రికార్డును ఓ సౌతాఫ్రికా యువ క్రికెటర్ బద్దలు కొట్టాడు. 2016లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో పంత్.. నేపాల్‌పై 18 బంతుల్లో అర్ధశతకం సాధించి ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేయగా.. దక్షిణాఫ్రికా యంగ్ గన్ స్టీవ్ స్టోక్(Steve Stolk) దాన్ని అధికగామించాడు. శనివారం(జనవరి 27) స్కాట్లాండ్‌తో జరిగిన అండర్ -19 ప్రపంచ కప్‌లో మ్యాచ్ లో స్టోక్ 13 బంతుల్లో ఫిఫ్టీ చేసి పంత్ ఏడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. అనంతరం 270 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 27 ఓవర్లలోనే ఛేదించింది. స్టీవ్ స్టోల్క్(86;37 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్ లు) సుడిగాలి ఆరంభాన్ని ఇవ్వగా.. దీవాన్ మరైస్((80; 50 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్ లు), డేవిడ్ టీజర్(38 బంతుల్లో 43 నాటౌట్) జోడి మిగిలిన పని పూర్తిచేశారు.
Steve Stolk's smashing knock against Scotland on Saturday earns a spot in this elite list ?#U19WorldCup pic.twitter.com/KGk2yhaP1p
— ICC (@ICC) January 27, 2024
ఐపీఎల్ 2024తో ఎంట్రీ
గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రిషభ్ పంత్.. మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024తో తన రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకోసం అతను కఠోర సాధన చేస్తున్నాడు.