IND vs AUS: హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాను నిలబెట్టిన స్టీవ్ స్మిత్

IND vs AUS: హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాను నిలబెట్టిన స్టీవ్ స్మిత్

దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ పోటాపోటీగా జరుగుతుంది. ఓ వైపు వికెట్లు తీసి భారత బౌలర్లు రాణిస్తుంటే.. మరోవైపు కంగారూల కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత బౌలింగ్ కు ఎదురొడ్డి నిలుస్తున్నాడు. అజేయ హాఫ్ సెంచరీ చేసి జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. కఠినమైన దుబాయ్ పిచ్ పై 68 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో రెండు సార్లు స్మిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. షమీ రిటర్న్ క్యాచ్ పట్టకపోవడం వలన బతికిపోయిన స్మిత్.. అంతకముందు బంతి స్టంప్స్ కు తగిలినా బెయిల్స్ పడకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రెండు అవకాశాలను బాగా ఉపయోగించుకున్న స్మిత్ ఆసీస్ ను దగ్గరుండి నడిపిస్తున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ ప్రస్తుతం 60 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. స్మిత్ ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. 

ALSO READ | IND vs AUS: షమీ చేతిలోకి వచ్చినట్లే వచ్చి.. మిస్ అయిన క్యాచ్

స్మిత్ తో పాటు ట్రావిస్ హెడ్ రాణించడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజ్ లో స్మిత్ (60), అలెక్స్ క్యారీ (1) ఉన్నారు. హెడ్ ఉన్నంతసేపు వేగంగా ఆడి 33 బంతుల్లో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఔటయ్యాడు. కొనొల్లి(0), ఇంగ్లీస్ (11) విఫలమయ్యారు, లబు షేన్ 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. భారత్ బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు.