BBL 2024-25: బిగ్ బాష్ లీగ్.. మెరుపు సెంచరీతో దుమ్ములేపిన స్టీవ్ స్మిత్

టెస్ట్ బ్యాటర్ అన్నారు.. ఐపీఎల్ లో ఎవరూ కొనుగోలు చేయలేదు. టీ20 కెరీర్ ముగిసిపోయిందన్నారు. ఇవన్నీ ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గురించి చెబుతున్న మాటలు. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు సెంచరీలు చేసి ఫామ్ లోకి వచ్చిన స్మిత్.. అదే జోరును బిగ్ బాష్ లీగ్ లో కొనసాగిస్తున్నాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఈ సీజన్ లో ఆడిన తొలి టీ20 మ్యాచ్ లోనే సెంచరీతో చెలరేగాడు. పెర్త్ స్కార్చర్ పై మెరుపు సెంచరీ చేసి తమ జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 

శనివారం (జనవరి 11) సిడ్నీ వేదికగా జరిగిన పెర్త్ తో జరిగిన మ్యాచ్  మ్యాచ్ లో ఓపెనర్ గా దిగిన స్మిత్ ప్రారంభంలో ఆచితూచి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకొని ఆ తర్వాత వేగం పెంచాడు. 50 నుంచి 100 పరుగులు చేయడానికి 22 బంతులే అవసరమయ్యాయి. మొత్తం 64 బంతుల్లో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్మిత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు.. 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ స్మిత్ విమర్శకులకు గట్టిగా సమాధానమిచ్చాడు.  

Also Read : అంతర్జాతీయ క్రికెట్‌కు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ రిటైర్మెంట్

స్టీవ్ స్మిత్ ఐపీఎల్ లో ఆడడానికి ఆసక్తి చూపించిన అతడిని ఏ జట్టు తీసుకోలేదు. స్మిత్ తో పాటు కెప్టెన్ హెన్రిక్స్ రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పెర్త్ స్కార్చర్స్ పోరాడుతుంది. ప్రస్తుతం 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. స్కార్చర్స్ గెలవాలంటే 78 బంతుల్లో 166 పరుగులు చేయాల్సి ఉంది.