2 వేల కోట్ల స్కామ్.. నటి అరెస్ట్

2 వేల కోట్ల స్కామ్.. నటి అరెస్ట్
  • దిబ్రూగఢ్​లో అదుపులోకి 

గౌహతి: అస్సాంలో కలకలం సృష్టించిన ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ స్టాక్‌‌‌‌‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌ స్కామ్​లో ఓ నటిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం దిబ్రూగఢ్ లో స్పెషల్ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్(ఎస్ టీఎఫ్) అధికారులు నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకున్నారు. అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల స్కామ్ ను గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిశాల్ ఫుకాన్‌‌‌‌‌‌‌‌(22) ను ఇప్పటికే అరెస్టు చేశారు.

తమ ముందు విచారణకు హాజరు కావాలని సుమి బోరా, తార్కిక్ బోరాకు పోలీసులు గతంలో నోటీసులు ఇచ్చారు. అయితే, వారు హాజరు కాకపోవడంతో దంపతులతో పాటు మరో నలుగురికి లుకౌట్ నోటీసులు  ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి అరెస్టు చోటు చేసుకుంది. అంతకు ముందు సుమి బోరా కొన్ని టెలివిజన్ చానల్​లకు వీడియో మెసేజ్ ను రిలీజ్ చేశారు. తాను పోలీసుల ముందు లొంగిపోతానని, వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు.