కొత్తపల్లి, వెలుగు : కొత్తపల్లి పట్టణంలోని సెయింట్‌జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు క్షేత్ర పర్యటనకు నార్త్ ఇండియాకు వెళ్లారు. దీనిలోభాగంగా ఢిల్లీలోని ఇండియా గేట్, కుతుబ్‌మినార్, రెడ్ ఫోర్ట్, తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్, అమృత్సర్, జలియన్ వాలాబాగ్, శ్రీకృష్ణ జన్మస్థానం, పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్, వాగ్ బార్డర్, చండీఘర్‌లోని రాక్ గార్డెన్, బిర్లామందిర్, ఇండియా పాకిస్తాన్ బార్డర్, దయాల్బాగ్సై
న్స్ మ్యూజియం, ప్లానిటోరియాన్ని సందర్శించారు. స్కూల్ చైర్మన్ పి.ఫాతిమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో చారిత్రక అవగాహనను పెంపొందించడానికి క్షేత్ర పర్యటనలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జిలు మల్లారెడ్డి, సురేందర్, మాధవి, శ్రీనాథ్, ప్రిన్సిపాల్స్ భార్గవ్, నిరంజన్, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.