29 మందికి స్త్రీశక్తి అవార్డులు

29 మందికి స్త్రీశక్తి అవార్డులు

హైదరాబాద్, వెలుగు: తమతమ రంగాలలో రాణించిన మహిళ వ్యాపారవేత్తలు, వ్యక్తులకు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ(టీసీఈఐ) శనివారం స్త్రీ శక్తి అవార్డులను అందించింది. ఈ అవార్డ్స్ కోసం మొత్తంగా 165 అప్లికేషన్లు వచ్చాయని టీసీఈఐ పేర్కొంది. వీరిలో 29 మందికి స్త్రీ శక్తి అవార్డులను ఇవ్వగా, ఐదు మందికి స్త్రీ మూర్తీ అవార్డ్ను అందించారు. టీసీఈఐ ఈ అవార్డ్లను వరుసగా మూడో ఏడాది కూడా అందజేసింది. ప్లేబ్యాక్ సింగర్ భార్గవి పిళ్లై, స్టార్ట్ వెంచర్స్కు చెందిన మెహర్ అరియా, వేదిక ఈవెంట్స్కు చెందిన విజయలక్ష్మి, ప్రసన్న, పినాకిల్ గ్రూప్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్కు చెందిన యెర్రోజు శ్రీదేవి , బీఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సంజనా షాలకు స్త్రీ మూర్తి అవార్డులు దక్కాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్టార్లో మహిళల పాత్ర తక్కువగా ఉందని, మరింత మంది ఈ బిజినెస్లోకి రావాలని టీసీఈఐ సెక్రటరీ నీరజ్ ఠాకూర్ అన్నారు. వివిధ రంగాలలో రాణించిన వుమెన్ ఎంటర్ప్రెన్యూర్లకు ఈ అవార్డులను అందించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ‘మగవాళ్లు చేసే పనులను మహిళలు చేయలేరని అనే ఆలోచన సమాజంలో ఉంది. ఇది తప్పు అని మహిళలు నిరూపిస్తున్నారు’ అని టీసీఈఐ ప్రెసిడెంట్ రాఖీ కంకారియా అన్నారు.

For More News..

హైదరాబ్యాడ్ షో.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్

జూన్లో కరోనా వ్యాక్సిన్ ఖాయం

ఐటీ రిటర్న్స్ లో కొత్త రూల్స్