హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ వర్షం కారణంతో రద్దయింది. రాత్రి ఏడున్నర ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. వర్షం కారణంగా ఆలస్యం అయింది. ఉప్పల్ లో ఇంకా వర్షం కురుస్తోంది. ఔట్ ఫీల్డ్ లో నీరు నిలిచింది. దీంతో మ్యాచ్ నిర్వహించడం కష్టంగా మారింది.మరోసారి ఎంపైర్లు, కెప్టెన్లు గ్రౌండ్ ను పరిశీలించి మ్యాచ్ ను రద్దు చేశారు. గుజరాత్, హైదారాబాద్ కి చెరో పాయింట్ కేటాయించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పాయిం ట్ల తో నేరుగా ప్లే ఆఫ్ లోకి వెళ్లింది.
మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో మొత్తం 15 పాయింట్లతో సన్‌రైజన్స్ హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. చెన్నై సూపర్ కింగ్స్ మినహా ఇతర జట్లేవీ 16 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో సన్‌రైజర్స్ మార్గం సుగుమవుతుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కి చేరాయి.
అయితే ప్లే ఆఫ్స్ లో మూడు బెర్త్ లను కోల్ కతా, రాజస్థాన్, సన్ రైజర్స్ దక్కించుకోగా చివరి బెర్త్ ఎవరు దక్కించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం ముంబైపై లక్నో చివరి లీగ్ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు శనివారం (మే 18) జరిగే ఆర్సీబీ, చెన్నై మ్యాచ్ లో సీఎస్కే గెలిస్తే ఫ్లేఆఫ్స్ కు వెళుతుంది. ఈ మ్యాచ్ లకు కూడా వర్షం ముప్పు ఉంది.