శ్రీశైలం ప్లాంట్‌లో నెలాఖరుకి కరెంట్ జనరేషన్ లేనట్లే!
మొరాయిస్తున్న ఒకటి, రెండు యూనిట్లు
నాగర్ కర్నూల్, వెలుగు: శ్రీశైలం పవర్‌ప్లాంట్ లో ఈ నెలాఖరు వరకు విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఒకటి, రెండు యూనిట్లను పూర్తిగా రెడీ చేసిన ఇంజినీర్లు వాటిని రన్చేయగా 400 కేవీ టవర్లైన్లో అవుట్‌పుట్100 కేవీ దాటకపోవడంతో తిరిగి నిలిపివేశారు. వీటిని పర్యవేక్షించడానికి చెన్నై నుంచి టెక్నీషియన్లను రప్పించారు. రోజుకు అక్షరాల 30 లక్షలు చెల్లిస్తున్నారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ట్రయల్‌రన్ కొలిక్కి రాలేదని సమాచారం. దీంతో కేబుళ్లను తిరిగి టెస్ట్చేస్తున్నారు. మరో పక్క సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన 15 రోజులు తర్వాత రెండు యూనిట్లను నడిపిస్తామని చెప్పిన జెన్కో అధికారులు తర్వాత ఆ సమయాన్ని నెల రోజులకు పొడిగించారు. ఒకటి, రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ఉత్పత్తి చేయడానికి ఆయిల్ట్యాంకర్లను రెడీ చేసి ఆయిల్మార్చడంతో పాటు కంప్రెషర్ మోటార్లు ఫిట్‌చేసి ట్రయల్‌రన్ చేశారు. నాలుగు, ఐదు, ఆరు యూనిట్ల కంప్రెషర్ మోటార్లు విప్పి పెట్టారు. డీవాటరింగ్ మోటార్లు ఎనిమిదింటికిగాను ప్రస్తుతం 4 నడుస్తున్నాయి. ఆరో యూనిట్దగ్గర మరో మూడు మోటార్లు దింపుతారని సమాచారం. 1, 2, 3 యూనిట్లకు గవర్నర్ మోటార్లు రెడీ చేశారు. ఈ నెల చివరి వరకు ఒకటి,రెండు యూనిట్లను రెడీ చేసి రన్చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు అంటున్నా ఆశించినంత స్పీడ్‌గా పనులు జరగడం లేదని సమాచారం.
జీఐఎస్ రెడీ అయితేనే..
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో ఆగస్టు 20న ప్రమాదం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి, అధికారులు రెస్క్యూ ఆపరేషన్, సహాయ చర్యలను పర్యవేక్షించారు. పొగబారిన ఫ్లోర్లలో ఏముందో తెలియకముందే నష్టం పెద్దగా జరగలేదన్న అభిప్రాయంతో పాటు 15 రోజుల్లో రెండు యూనిట్లు నడిపిస్తామని ప్రకటించారు. సీఐడీ విచారణ, జెన్కో టెక్నికల్టీం కమిటీల రిపోర్ట్అందాల్సి ఉండగా మరోవైపు ప్లాంట్ పునరుద్ధరణ పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు నాలుగు ఫ్లోర్ల క్లీనింగ్పనుల మీద దృష్టి పెట్టారు. ఇందులో కీలకమైన జీఐఎస్‌లో కంప్రెషర్లు, ట్రాన్స్ ఫార్మర్లను పరిశీలించడానికి గతంలో ఇక్కడ పనిచేసి విదేశాల్లో శిక్షణ పొందిన డీఈ వెంకటేశ్వర్‌రెడ్డిని డిప్యుటేషన్‌పై రప్పించారు. ఆయనతోపాటు మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఎస్, జీఐఎస్విభాగాల పర్యవేక్షణకు గతంలో ఇక్కడ పనిచేసిన దాదాపు 20 మంది సీనియర్ ఇంజినీర్లను డిప్యూటేషన్ మీద పిలిపించారు. ఆరు యూనిట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్విచ్‌యార్డ్‌కు సరఫరా చేసే జీఐఎస్ రెడీ అయితే తప్ప మొదటి రెండు యూనిట్ల నుంచి విద్యుత్వచ్చే అవకాశం లేదని సమాచారం. అందులోని ప్రతిభాగాన్ని శుభ్రం చేసిన తర్వాత కట్అయిన కేబుల్స్, ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్మార్చాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాల్లో ఉన్న కేబుల్, విడి భాగాలు, ఆయిల్ తెప్పించిన జెన్కో అధికారులు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుపోమని చెప్తున్నట్లు సమాచారం.
For More News..