- అందరి సమక్షంలోనే త్వరలో వెల్లడిస్త: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గురువారం ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. పినపాక, అశ్వాపురం, కరకగూడెం, బూర్గంపాడు మండలాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మార్పుపై ఎవరికి వారు రకరకాల ఊహాగానాలు చేస్తుండడం మామూలేనన్నారు.
వైఎస్ఆర్టీపీలోకి వస్తానని పొంగులేటి తనకు మాటిచ్చారని ఆ పార్టీ చీఫ్షర్మిల అంటున్నారు కదా అనే ప్రశ్నకు ‘మాటివ్వడం అంటే ఇట్లా ఉంటాదా?’ అని ఎదురు ప్రశ్నించారు. త్వరలోనే తన నిర్ణయాన్ని అందరి సమక్షంలో వెల్లడిస్తానని చెప్పారు. ఆయన వెంట పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తూళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.