బిన్‌ లాడెన్ ట్విన్‌ టవర్స్‌ కూల్చి 20 ఏండ్లు.. నాడు – నేడు శాటిలైట్‌ చిత్రాలు

బిన్‌ లాడెన్ ట్విన్‌ టవర్స్‌ కూల్చి 20 ఏండ్లు.. నాడు – నేడు శాటిలైట్‌ చిత్రాలు

ఉగ్ర పంజాకు అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలమైన రోజు ఇది. న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్‌ సెంటర్ ట్విన్‌ టవర్స్‌ను అల్‌ ఖైదా ఉగ్రవాద సంస్థ ఫ్లైట్ ద్వారా కూల్చివేసి నేటికి 20 ఏండ్లు గడిచింది. అమెరికా ప్యాసింజర్ విమానాలనే హైజాక్‌ చేసి టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు నాలుగు వేల మందికిపైగా మరణించారు. ఈ దాడితో ట్విన్ టవర్‌‌ నేలకూలగా.. ఆకాశంలోకి ఎగసిన దుమ్ము, బూడిద, పొగతో పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అఫ్గానిస్థాన్‌లో ఉండి అల్‌ ఖైదా టెర్రరిస్టు బిన్‌ లాడెన్‌ ఈ దాడికి కుట్ర చేశాడు. 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఈ (9/11 అటాక్స్) ఉగ్రదాడి తర్వాత అమెరికా తన బలగాలను అఫ్గాన్‌లో దించి ఉగ్రవాదులను తుడిచి పెట్టే పనిలో దిగింది. ఆ దాడి జరిగిన పదేండ్ల తర్వాత 2011 మే 1 పాకిస్థాన్‌లోని అబోట్టాబాద్‌లో అమెరికా సైన్యం ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చింది.

ఈ దాడికి పాల్పడిన అల్‌ ఖైదా ఆత్మాహుతి దళం మొత్తం నాలుగు విమానాలను హైజాక్‌ చేసింది. 23 టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. హైజాక్ చేసిన వాటిలో రెండు విమానాలు 110 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ను ఢీకొట్టగా.. మరోకటి అమెరికా డిఫెన్స్ హెడ్‌ క్వార్టర్ పెంటగాన్‌పై దాడి చేసింది. నాలుగో ప్లేన్‌లోని ప్యాసింజర్స్ విషయం అర్థం చేసుకుని టెర్రరిస్టులపై తిరగడడంతో పెన్సిల్వేనియాలో క్రాష్‌ ల్యాండ్ అయింది. లేకుంటే అది అమెరికా అధ్యక్ష భవనం లేదా పార్లమెంట్‌పై అటాక్ చేసి ఉండేదని నాడు వార్తలు వచ్చాయి. ఈ టెర్రర్ అటాక్‌కు ప్లాన్‌ చేసిన లాడెన్‌కు నాడు ఆశ్రయమిచ్చిన అఫ్గాన్‌లోని తాబిబాన్‌ సర్కారును అమెరికా దించేసి.. తన బలగాలతో ఉగ్రవాదులను వేటాడి వెంటాడి మట్టుబెట్టింది. కానీ ఈ ఘటనకు 20 ఏండ్లు అవుతున్న కొద్ది వారాల క్రితమే అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో మళ్లీ ఆ అరాచకపు తాలిబాన్లు అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చరిత్రలో విషాదమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆ తాలిబాన్ల తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు వేడుక నేడు జరగాల్సి ఉంది.. అయితే అమెరికా ఒత్తిడితో వెనక్కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, అమెరికాలో ట్విట్ టవర్స్‌ కూల్చివేత.. ఆ ఘోర దృశ్యాలు, ఆ తర్వాత అక్కడ మెమోరియల్ ఏర్పాటు, 20 ఏండ్ల తర్వాత 2021లో నేడు అక్కడ జరిగిన మార్పులకు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్‌ను మ్యాక్సర్ టెక్నాలజీస్ అనే సంస్థ విడుదల చేసింది.

ట్విన్‌ టవర్స్‌ను అల్‌ ఖైదా హైజాక్ చేసిన ఫ్లైట్లు ఢీకొట్టడంతో దుమ్ము, బూడిద, పొగ ఆకాశానికి ఎగసిన చిత్రం (2001 సెప్టెంబర్ 11)

 

ట్విన్‌ టవర్స్ పూర్తిగా నేలమట్టమై.. దుమ్ము మొత్తం ఊడ్చేసిన తర్వాతి చిత్రం (2001 సెప్టెంబర్ 15)

 

పెంటగాన్‌పై దాడికి ముందు చిత్రం

 

పెంటగాన్‌పై దాడి తర్వాత చిత్రం

 

నాలుగో ఫ్లైట్ క్రాష్ అయిన పెన్సిల్వేనియాలోని మైదానం, తర్వాత ఇక్కడ కూలిన ఫ్లైట్ పేరుతో ఫ్లైట్ 93 నేషనల్ మెమోరియల్‌ను నిర్మించారు.

 

ట్విన్‌ టవర్స్ కూలిన ప్లేస్‌లో కట్టిన 9/11 నేషనల్‌ మెమోరియల్ మ్యూజియం