యూఎస్ ఎకనామిక్ సిస్టమ్ క్రైసిస్, ఆసియా మార్కెట్ల క్షీణతల మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. బ్యాంకింగ్, ఆటో, ఐటీ , ఎనర్జీ స్టాక్ ల ద్వారా సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం ఆగస్టు 2,2024న నష్టాలతో ప్రారంభమయ్యాయి. BSE సెన్సెక్స్ 814 పాయింట్ల నష్టంతో 81వేల 026 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 282 పాయింట్ల నష్టంతో 24వేల 728 వద్ద ట్రేడవుతోంది. BSE సెన్సెక్స్ లో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.26 లక్షల కోట్లు నష్ట పోయాయి.
నిఫ్టీ మెటల్ , పీఎస్ యూ బ్యాంక్ అత్యధికంగా 2శాతం పైగా పతనమయ్యాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 , నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఒక్కొక్కటి 1శాతం కంటే ఎక్కువ పడిపోవడంతో అన్ని ప్రధాన రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి.
యుఎస్ ఆర్థిక వ్యవస్థపై సందేహాలు లేవనెత్తిన బలహీనమైన తయారీ డేటా కారణంగా యుఎస్ స్టాక్‌లు పతనమయ్యాయి. తద్వారా భారతీయ స్టాక్ మార్కెట్ యుఎస్ మార్కెట్లలో కరెక్షన్‌ను అనుసరించింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.57శాతం క్షీణించి 40వేల200 వద్ద, S&P 500 1.76శాతం నష్టపోయి 5వేల 424 వద్ద , నాస్‌డాక్ కాంపోజిట్ 2.76శాతం నష్టపోయి 17వేల114 వద్ద ట్రేడ్ అయ్యాయి.
US ఫ్యాక్టరీ డేటా ఊహించిన దానికంటే బలహీనంగా ఉండటంతో ఆసియా మార్కెట్లు పడిపోయాయి. జపాన్ వెలుపల MSCI ఆసియా- పసిఫిక్ షేర్ల విస్తృత సూచిక 0.8శాతం పడిపోయింది. జపాన్‌కు చెందిన నిక్కీ నాలుగేళ్లలో అత్యంత దారుణమైన దిగువకు పడిపోయింది.