- 7 నెలల కనిష్టానికి సెన్సెక్స్.. 1,235 పాయింట్లు డౌన్
- 320 పాయిట్లు కోల్పోయిన నిఫ్టీ
- ట్రంప్ టారిఫ్ వార్, ఎఫ్ఐఐల సెల్లింగ్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ : ఈక్విటీ మార్కెట్లు మంగళవారం కుప్పకూలాయి. ట్రంప్ టారిఫ్ వార్, విదేశీ నిధులు తరలిపోవడం, భారీగా అమ్మకాల వల్ల సెన్సెక్స్ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.7.52 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ సెన్సెక్స్1,235.08 పాయింట్లు (1.60 శాతం) నష్టపోయి 75,838.36 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏకంగా 1,431.57 పాయింట్లు కోల్పోయింది. ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్వంటి సెన్సెక్స్షేర్లలో అమ్మకాల ఒత్తిడితో ఈ సూచీ డీలా పడింది. నిఫ్టీ 320.10 పాయింట్లు నష్టపోయి 23,024.65 వద్ద స్థిరపడింది.
గత జూన్ తరువాత ఇంతలా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 367.9 పాయింట్లు పడింది. ట్రంప్ ప్రెసిడెండ్గా బాధ్యతలు చేపట్టిన రోజే టారిఫ్లు భారీగా విధిస్తానని ప్రకటించడంతో డొమెస్టిక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. రూపాయి విలువ పడుతూనే ఉండటం, మూడో క్వార్టర్ రిజల్ట్స్నిరాశపర్చడం వల్ల ఎఫ్ఐఐలు మరిన్ని ఈక్విటీలను అమ్మే అవకాశం ఉందని చెప్పారు.
సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా జొమాటో 10.92 శాతం నష్టపోయింది. మూడో క్వార్టర్లో దీని లాభం దారుణంగా పడిపోవడంతో ఇలా జరిగింది. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ఐబీ, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ఫైనాన్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడా పతనమయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ మాత్రమే లాభపడ్డాయి.
సెక్టోరల్ ఇండెక్స్లకూ నష్టాలే
బీఎస్ఈ సెక్టోరల్ఇండెక్స్లలో రియల్టీ అత్యధికంగా 4.22 శాతం పడిపోయింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 3.99 శాతం, కన్జూమర్ డిస్క్రెషనరీ 2.90 శాతం, సర్వీసెస్ 2.86 శాతం, పవర్ 2.63 శాతం, టెలికం 2.52 శాతం, యుటిలిటీస్ 2.35 శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,788 స్టాక్స్నష్టపోగా, 1,187 స్టాక్స్లాభపడ్డాయి. ట్రంప్ విధానాల వల్ల ఇండియా సహా చాలా దేశాలు నష్టపోతాయని ఇన్వెస్టర్లు భయపడుతున్నారని మెహతా ఈక్విటీ లిమిటెడ్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సీ చెప్పారు.
ఆసియా మార్కెట్లలో టోక్యో, హాంగ్కాంగ్లాభపడగా, షాంఘై, సియోల్ ఫ్లాట్గా ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. సెలవు వల్ల అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. బ్రెంట్క్రూడ్ ధర 0.76 శాతం తగ్గి 79.54 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు సోమవారం రూ.4,336.54 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.