ఇండియన్ స్టాక్ మార్కెట్ కు HMPV వైరస్ దెబ్బ తగిలింది. ఇండియాలో రెండు కేసులు నమోదైనట్లు అధికారికంగా ప్రకటించటంతో.. స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పడిపోయింది. 2025, జనవరి 6వ తేదీ ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్.. ఆ తర్వాత వైరస్ వార్తలతో నెగెటివ్లోకి వెళ్లింది. 10.. 20.. 50.. 100 పాయింట్లు ఇలా పడిపోతే.. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ అయితే 330 పాయింట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. HMPV వైరస్ ఎఫెక్ట్ తో.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకే.. స్టాక్ మార్కెట్ ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి అయ్యింది.
బెంగళూరు సిటీలో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు.. ICMR.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ధృవీకరించటం.. ఆ ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవటం మరింత ఆందోళన కలిగిస్తుంది. అంటే ఇండియాలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైందన్న భయం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల్లో ఏర్పడింది. దీంతో లాభాల్లో ఉన్న షేర్లను కొందరు పెట్టుబడిదారులు తెగ నమ్ముతున్నారు. దీంతో మార్కెట్ అమ్మకాల ఒత్తిడికి గురైంది. కొనుగోళ్లు తక్కువగా ఉండటం.. అమ్మకాలు విపరీతంగా ఉండటంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి వెళ్లింది. ఏకంగా 1200 పాయింట్లు నష్టపోవటం అంటే.. బ్లాక్ మండే అంటున్నారు వ్యాపారులు.
మార్కెట్ల నుంచి పెద్దగా లాభాలను రాబట్టు కోలేకపోవడంతో మెజారిటీ ఇన్వెస్టర్లు ఇప్పటికే వెనక్కి వెళ్లిపోతున్నారు. ఎన్ఎస్ఈలో యాక్టివ్ క్లయింట్‌ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. పెద్దగా లాభాలు రాకపోవడంతో చాలా మంది ట్రేడింగ్ను వదిలేస్తున్నారని మార్కెట్ ఇన్‌సైడర్‌లు అంటున్నారు. స్టాక్ మార్కెట్లో నెగ్గుకు రావడం అంత సులభం కాదని కొత్త ట్రేడర్లు గ్రహించారు. అనుభవం లేని కొందరు ట్రేడర్లు ఎవరో ఇచ్చిన టిప్స్ ఆధారంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇలాంటి వాళ్లు ‘మార్కెట్ వేస్ట్’ అంటూ బయటకు వెళ్లిపోతున్నారు.
బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వల్ల రిస్క్ ఉండదు. స్థిరమైన ఆదాయం వస్తుంది కాబట్టి చాలా మంది దృష్టి అటువైపు మళ్లింది. క్రిప్టో కరెన్సీలు, రియల్ ఎస్టేట్ వంటి అసెట్క్లాసులు మంచి రాబడులు ఇస్తుండటంతో వాటివైపు కొందరు వెళ్లారు. దలాల్ స్ట్రీట్‌లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య తగ్గినా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి డబ్బు మాత్రం భారీగా ఫ్లో అవుతోంది. మార్కెట్లలో ట్రేడర్ల సంఖ్య తగ్గుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, హెచ్చుతగ్గులు సహజమని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.