
శుక్రవారం (ఫిబ్రవరి 28) భారత స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ భారీ నష్టాలను చవిచూసింది. ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్ ,నిఫ్టీ 50 కుప్పకూలాయి. బీఎస్సీ సెన్సెక్స్ 1000 పాయింట్లు క్షీణించి 73,597 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 సూచీ కూడా 317 పాయింట్లు తగ్గి 22,22వేల 227 దగ్గర ట్రేడ్ అవుతోంది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే భారీ నష్టాలను చూసింది. ఉదయం 9.22 గంటలకు సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్ట స్థాయి 73,843.07కు, నిఫ్టీ 22,313.95 పాయింట్లకు చేరుకున్నాయి.
బ్యాంకింగ్,ఐటి రంగ స్టాక్‌లలో గణనీయమైన క్షీణత కారణంగా సెన్సెక్స్,నిఫ్టీ ప్రభావితమయ్యాయి. కీలకమైన జీడీపీ గణాంకాల ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తగా పడ్డారు.మరోవైపు టారిఫ్‌లకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనలతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. బీఎస్ఈ -లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 5.8 లక్షల కోట్లు తగ్గి రూ.387.3 లక్షల కోట్లకు చేరుకుంది. ఎన్విడియా పేలవమైన పనితీరు తర్వాత యుఎస్ మార్కెట్లలో రాత్రి పూట తిరోగమనం ప్రభావంతో నిఫ్టీ ఐటీ స్టాక్‌లు 4శాతం వరకు క్షీణించాయి.
భారత షేర్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?
స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం..భారత స్టాక్ మార్కెట్ ఈ ఐదు కీలకమైన కారణాల వల్ల పడిపోతోంది. భారతీయ బ్యాంకుల ఆదాయం క్షీణించడం, MSCI పునరాలోచన, DIIలు అధిక స్థాయిలలో నిలిచిపోవడం, US బాండ్ల పెరుగుదల, చైనా FIIలు తరలిపోవడం వంటి కారణాలతో భారత షేర్ మార్కెట్ కుప్పకూలింది