కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఏం జరుగుతోంది..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఏం జరుగుతోంది..

స్టాక్  మార్కెట్ల పతనం కొనసాగుతోంది. సుమారు నెలరోజుల కిందట ఆల్ టైం హై ని టచ్ చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొద్దిరోజులుగా నష్టాల పరంపర కొనసాగిస్తున్నాయి. ఒకపక్క ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, మరో పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు వెరసి  వరుస సెషన్లలో నష్టాలు నమోదు చేస్తున్నాయి ఇండెక్స్ లు. శుక్రవారం ( నవంబర్ 1, 2024 ) మూరత్ ట్రేడింగ్ లో లాభాలు నమోదవ్వగా... మరుసటిరోజు నుండి పరిస్థితి మొదటికి వచ్చింది. సోమవారం( నవంబర్ 4, 2024 ) భారీ పతనం దిశగా అడుగులేస్తున్నాయి స్టాక్ మార్కెట్లు.

Also Read :- ఆరు కంపెనీల మార్కెట్ క్యాప్​ రూ.లక్ష కోట్లు అప్

సోమవారం ( నవంబర్ 4, 2024 ) 12 గంటల సమయానికి సెన్సెక్స్ 1250 పాయింట్లు డ్రాప్ అవ్వగా... నిఫ్టీ 424 పాయింట్లు డ్రాప్ అయ్యింది. ఈ క్రమంలో సుమారు రూ. 10 లక్షల కోట్లకు పైగానే ఇన్వెస్టర్ల సొమ్ము పతనమై ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. మంగళవారం ( నవంబర్ 5, 2024 ) అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.   

స్టాక్ మార్కెట్ల పతనానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తోడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తుందని అంచనాలు ఉండటం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకోవటం వంటి కీలక అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు