బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ ఢమాల్ 

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. స్టాక్ మార్కెట్ ఢమాల్ అయ్యింది. సెన్సెక్స్ 600 పాయింట్లపైన.. నిఫ్టీ 200 పాయింట్ల పైన నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 

మౌలిక వసతులు, ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. అయినా స్టాక్ మార్కెట్ రెడ్ లో ట్రేడ్ అవుతుంది. దీనికి కారణం మూలధన పెట్టుబడులపై వచ్చే లాభాలపై పన్నులను పెంచనున్నట్లు ప్రకటించమే కారణం. దీనికితోడు డాలర్ తో రూపాయి విలువ 83 రూపాయల 69 పైసలకు పడిపోయింది. రూపాయి విలువ పడిపోవటం ఆల్ టైం హైకి చేరింది. అదే విధంగా మూలధన పెట్టుబడులపై వచ్చే లాభాలపైనా పన్ను పెంచుతున్నట్లు ప్రకటించటం కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు నచ్చలేదు. 

ఓ దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లపైన నష్టాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమంగా 400 పాయింట్లు రికవరీ అయ్యి.. 600 పాయింట్ల నష్టానికి చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆయిల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రియాల్టీ, ఐటీ, పోర్టులు, ఇన్ ఫ్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.