హైదరాబాద్ లో భారీ స్టాక్ మార్కెట్ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి వేల మందిని బురిడీ కొట్టించింది ఓ స్టాక్ బ్రోకింగ్ సంస్థ. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీ మోసానికి పాల్పడింది డీబీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ. ఏడాదికి 120 శాతం లాభాలు ఇస్తామని బురిడీ కొట్టించింది.
కస్టమర్లకు అధిక లాభాల ఆశ చూపి.. 7 వేల కోట్ల స్కాంకు పాల్పడింది డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ . హైదరాబాద్ లో 20 వేల మంది బాధితులు ఉన్నారు. హైదరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఎదుటు బాధితులు అందోళనకు దిగారు.
Also Read :- లాభాల్లో స్టాక్ మార్కెట్లు
2018 నుంచి డీబీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ పెట్టుబడులు స్వీకరిస్తోంది. 2024 నుంచి చెల్లింపులు ఆగిపోయాయని బాధితులు చెబుతున్నారు. సైబరాబాద్ ఎకమిక్ అఫన్సెస్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.