పశ్చిమాసియాలో యుద్ధ భయం..భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో యుద్ధ భయం..భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి తర్వాత మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య గురువారం (అక్టోబర్ 3, 2024) ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 1770 పాయింట్లకు పైగా నష్టపోయి 8వేల 800 పాయింట్ల దిగువల ట్రేడ్ అయింది. నిఫ్టీ కూడా 450 పాయింట్లు కోల్పోయి 25వేల 350 పాయింట్ల కంటే దిగువన ట్రేడ్ అయింది. 

గురువారం( అక్టోబర్ 3, 2024)  NSE నిఫ్టీలో BPCL, శ్రీరామ్ ఫైనాన్స్ , లార్సెన్ అండ్ టూబ్రో,ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాలను చవిచూడగా.. JSW స్టీల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, ONGC, టాటాస్టీల్ లాభపడ్డాయి. 

ALSO READ | స్టాక్ మార్కెట్ ఢమాల్.. 6 లక్షల కోట్ల డబ్బు ఆవిరి.. కారణం ఇదే..!

BSE సెన్సెక్స్ లో JSWస్టీల్, సన్ ఫార్మా, మహీంద్రాఅండ్ మహీంద్రా వంటి సంస్థలు లాభపడగా.. ఏషియన్ పెయింట్స్,లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ , బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ , టైటాన్ , తోపాటు 30 షేర్ల ఇండెక్స్ లో మారుతి సుజుకీ ఇండియా భారీగా నష్టపోయాయి. 

అన్ని రంగాల సూచీలు రియాల్టీ 4.5 శాతం, ఆటో, బ్యాంక్, మీడియా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్ 2-3 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి.బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 2 శాతం చొప్పున క్షీణించాయి.