స్టాక్ మార్కెట్.. ఐదో రోజూ లాభాలే.. రెండే కారణాలు..

స్టాక్ మార్కెట్.. ఐదో రోజూ లాభాలే.. రెండే కారణాలు..
  • ఐదో రోజూ లాభాలే !
  • 557 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • నిఫ్టీ 159 పాయింట్లు జామ్

న్యూఢిల్లీ: ఎఫ్ఐఐల కొనుగోళ్లు, బ్యాంక్ ​స్టాక్స్​లో ర్యాలీ కారణంగా శుక్రవారం బెంచ్​మార్క్​ ఇండెక్స్​లు దూసుకెళ్లాయి. 30 షేర్ల బీఎస్​ఈ సెన్సెక్స్​ 557.45 పాయింట్ల లాభంతో 76,905 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 698.88 పాయింట్ల వరకు పెరిగింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 159.75 పాయింట్లు లాభపడి 23,350.40 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.22.12 లక్షల కోట్లు పెరిగింది. యూఎస్ ​ఫెడ్​ మరో రెండుసార్లు రేట్లకు కోత పెడుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయని ఎనలిస్టులు తెలిపారు.

సెన్సెక్స్ ప్యాక్ నుంచి ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, లార్సెన్ అండ్​ టూబ్రో, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, జొమాటో లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, మహీంద్రా అండ్​ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్ వెనకబడి ఉన్నాయి. ఎఫ్​ఐఐలు గురువారం రూ.3,239.14 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. బీఎస్​ఈ సెక్టోరల్​ ఇండెక్స్​లలో కన్జూమర్​ డ్యూరబుల్స్, మెటల్ ​మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్లో సియోల్ ​ లాభాల్లో ముగిసింది. టోక్యో, షాంఘై, హాంగ్​కాంగ్​ నష్టపోయాయి. యూరప్ ​మార్కెట్లు నెగటివ్​గా ట్రేడవుతున్నాయి. యూఎస్​ మార్కెట్లు గురువారం నష్టపోయాయి.