మూడో రోజూ లాభాలు.. డిసెంబర్ 3న సెన్సెక్స్​ 597 పాయింట్లు అప్​

మూడో రోజూ లాభాలు..  డిసెంబర్ 3న సెన్సెక్స్​ 597 పాయింట్లు అప్​

ముంబై: బ్లూచిప్ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో కొనుగోళ్లు,  గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ మంగళవారం వరుసగా మూడవ రోజూ లాభాలు సంపాదించింది. ఇది 597.67 పాయింట్లు పెరిగి 80,845.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 701.02 పాయింట్లు పెరిగి 80,949.10 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 181.10 పాయింట్లు పెరిగి 24,457.15 వద్దకు చేరుకుంది.

సెన్సెక్స్ ప్యాక్ నుంచి అదానీ పోర్ట్స్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, ఎల్​ అండ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్,  రిలయన్స్  లాభపడ్డాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్, ఐటీసీ, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నష్టపోయాయి. 

సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో టెలికమ్యూనికేషన్, ఎఫ్​ఎంసీజీ మాత్రమే వెనకబడ్డాయి. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాల్లో స్థిరపడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రేడవుతున్నాయి.  సోమవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగానే ముగిశాయి.