ఈ వారమూ టారిఫ్‌‌‌‌లపైనే ఫోకస్‌‌‌‌ .. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్‌‌‌‌కు సెలవు

ఈ వారమూ టారిఫ్‌‌‌‌లపైనే ఫోకస్‌‌‌‌ .. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్‌‌‌‌కు సెలవు

న్యూఢిల్లీ: టారిఫ్‌‌‌‌ వార్తలు ఈ వారం కూడా మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయి.  ఇండియాపై త్వరలోనే పరస్పర టారిఫ్‌‌‌‌లు వేస్తామని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్‌‌‌‌ గత కొన్ని సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతోంది. దీంతో పాటు గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌‌‌‌ను, ఫారిన్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ల కదలికలను ట్రేడర్లు గమనించాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా  ఈ నెల 26న (బుధవారం) మార్కెట్‌‌‌‌కు సెలవు. 

ఈ వారం నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుందని అంచనా వేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్‌‌‌‌లు మిశ్రమంగా కదులుతున్నాయి. యూఎస్ ట్రేడ్ పాలసీ, రష్యా–ఉక్రెయిన్ వార్ వంటి అంశాలపై మార్కెట్ ఫోకస్ పెడుతుంది’ అని మోతీలాల్ ఓస్వాల్‌‌‌‌ సర్వీసెస్ ఎనలిస్ట్  సిద్ధార్ధ  ఖేమ్కా పేర్కొన్నారు. క్రూడాయిల్ ధరలను, డాలర్ మారకంలో రూపాయి కదలికలను జాగ్రత్తగా గమనించాలని సలహా ఇచ్చారు. ఈ వారం యూఎస్ కోర్ పీసీఈ ప్రైస్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌, ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ నెంబర్లు వెలువడనున్నాయి. మార్కెట్‌‌‌‌ మూడ్ ఇంకా నెగెటివ్‌‌‌‌లోనే ఉంది. కిందటి వారం సెన్సెక్స్‌‌‌‌ 628 పాయింట్లు (0.82 శాతం), నిఫ్టీ 133 పాయింట్లు (0.58 శాతం) పడ్డాయి. 

కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..

ఈ నెలలో ఇప్పటి వరకు నికరంగా రూ.23,710 కోట్లను ఇండియన్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు (ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు–ఎఫ్‌‌‌‌పీఐలు) విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు.  గత రెండు నెలల్లో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన షేర్లను అమ్మారు. డిపాజిటరీ డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌‌‌‌పీఐలు నికరంగా రూ.78,027 కోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోగా, ఈ నెలలో ఇప్పటివరకు రూ.23,710 కోట్లను విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. ఎఫ్‌‌‌‌పీఐల అమ్మకాలు కొనసాగుతుండడంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు నిఫ్టీ 4శాతం నష్టపోయింది.