
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు 18లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. సెన్సెక్స్ 1,380 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 275 పాయింట్లు తగ్గి 22,300 పాయింట్లకు చేరింది. అన్ని రంగాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. మిడ్-క్యాప్, స్మాల్ క్యాప్ అమ్మకాల కూడా భారీ ఒత్తిడికి గురయ్యాయి. మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పడిపోయాయి. బ్యాంక్ నిఫ్టీలో అమ్మకాలు ఒత్తిడి కనిపించింది. నిఫ్టీలో టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, ఎన్‌టిపిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి. అయితే కోల్ ఇండియా అత్యధికంగా లాభపడింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ దాదాపు 2.5 శాతం పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనలు ఇప్పటికే ఇన్వెస్టర్లో విశ్వాసాన్ని దెబ్బతీశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచడంతో ప్రారంభంలోనే సూచీలు పెద్దఎత్తున నష్టాల బాటపట్టాయి. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలతో మార్కెట్లు నష్టాల బాటపట్టాయి.