370 పాయింట్లు.. పుంజుకున్న సెన్సెక్స్

370 పాయింట్లు.. పుంజుకున్న సెన్సెక్స్

ముంబై: సెన్సెక్స్,  నిఫ్టీ మంగళవారం లాభాలను సాధించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, కొన్ని స్టాక్స్​లో ర్యాలీ కారణంగా  30 షేర్ల బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ సెన్సెక్స్ 378.18 పాయింట్లు పుంజుకుని 80,802.86 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ 518.28 పాయింట్లు పెరిగి 80,942.96 వద్దకు చేరుకుంది. నిఫ్టీ వరుసగా నాలుగో రోజు కూడా పుంజుకుంది. ఇది 126.20 పాయింట్లు పెరిగి 24,698.85 వద్దకు చేరుకుంది.  

30 సెన్సెక్స్ కంపెనీల్లో బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్, ఇండస్‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ, సన్ ఫార్మా లాభపడ్డాయి. అయితే, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్ వెనుకబడి ఉన్నాయి. ఇండెక్సుల్లో  క్యాపిటల్ గూడ్స్,  ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ వెనుకబడి ఉన్నాయి.