ఈ వారం ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీపై ఫోకస్‌‌

ఈ వారం ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీపై ఫోకస్‌‌
  • వడ్డీ రేట్లలో మార్పుండదని అంచనా

ముంబై: ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం,  గ్లోబల్ ట్రెండ్స్‌‌‌‌,  ఫారిన్ ఇన్వెస్టర్ల కదలికలు ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. అలానే  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ జీడీపీ డేటా,  ఆదివారం విడుదలైన ఆటో సేల్స్ డేటా ప్రభావం సోమవారం మార్కెట్‌‌‌‌లో కనిపించనుంది. 

జీడీపీ గ్రోత్ క్యూ2లో రెండేళ్ల కనిష్టమైన 5.4 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఇంకా గరిష్టాల్లో ఉండడం, జీడీపీ నెంబర్లు మెప్పించకపోవడంతో ఈసారి జరిగే ఎంపీసీ మీటింగ్‌‌‌‌లో వడ్డీ రేట్లను ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ మార్చకపోవచ్చని  అంచనా.  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ఎంపీసీ  పాలసీ వివరాలను డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 6 న బయటపెట్టనుంది. ఇండియా మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా  ఈ వారం విడుదలకానుంది.